Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
Rajya Sabha : ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ స్థానాల అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 10 రాజ్యసభ స్థానాలకుగాను.. 8 సీట్లు బీజేపీకి, 2 సీట్లు ఎస్పీకి దక్కాయి.
Rajya Sabha : ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ స్థానాల అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 10 రాజ్యసభ స్థానాలకుగాను.. 8 సీట్లు బీజేపీకి, 2 సీట్లు ఎస్పీకి దక్కాయి. 10 సీట్లు ఉన్న చోట 10 మంది మాత్రమే బరిలో నిలవడంతో పోటీ అవసరం లేకుండా పోయింది. మెజారిటీకి అనుగుణంగా ఎనిమిది మంది అభ్యర్థులు బీజేపీ తరఫున, ఇద్దరు సమాజ్‌వాదీ పార్టీ తరఫున బరిలో నిలిచారు.
పోటీ లేకపోవడంతో పది మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉత్తర ప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్తానాలు ఖాళీ కానున్నాయి. వీటికిగాను అక్టోబర్ 16న ఎన్నిక జరగాలి. కానీ, ఎన్నిక లేకుండానే నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ అభ్యర్థులు బీజేపీ, ఎస్పీ తరఫున ఇప్పటికే నామినేష్ వేశారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు నేడు పూర్తైంది. నామినేషన్ పత్రాల పరిశీలన అనంతరం మొత్తం 10 మంది బరిలో నిలిచారు. దీంతో అందరూ ఏకగ్రీవంగా గెలిచినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ విజయంతో పెద్దల సభలో ఎస్పీ సభ్యుల సంఖ్య ఐదుకు చేరింది.
ఇంతకుముందు రాజ్యసభలో ఎస్పీకి నలుగురు సభ్యులు (రాంగోపాల్ యాదవ్, జావేద్ అలీ, రాంజీ లాల్ సుమన్, జయా బచ్చన్) ఉండేవారు. ఇప్పుడు గెలిచిన రెండింట్లో ఒకటి గోపాల్ యాదవ్. అంటే, ఆయన పదవీకాలం పూర్తి కానుండగా.. మరోసారి ఆయనే గెలిచారు. ఇక, కొత్తగా ఎన్నికైంది ధన్‌రాజ్ నత్వాని. ఆయన చేరికతో ఎస్పీ రాజ్యసభ సభ్యుల సంఖ్య ఐదుకు చేరింది. ఇక, యూపీ నుంచి ఇప్పుడు బీజేపీ తరఫున ధర్మపాల్ సింగ్, ప్రకాష్ పాల్, శ్రుతి గంగ్వార్, విద్యా సాగర్ సోంకార్, ప్రియాంకా రావత్, రాధాకాంత్ ఓజా, గోపి కృష్ణా పాండే, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్ గెలిచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

