IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
IND vs WI : వన్డే సిరీస్‌ను ఒడిసిపట్టిన భారత జట్టు టీ20 సిరీస్‌లో రెండో విజయంపై కన్నేసింది.రికార్డు స్థాయిలో 9సార్లు టాస్ నెగ్గిన శ్రేయాస్ అయ్యర్ బదులు.. షాయ్ హోప్ టాస్ గెలిచాడు.
IND vs WI : వన్డే సిరీస్‌ను ఒడిసిపట్టిన భారత జట్టు టీ20 సిరీస్‌లో రెండో విజయంపై కన్నేసింది. తొలి మ్యాచ్‌లో అదిరే విజయంతో ముందంజ వేసిన టీమిండియా.. అదే ఊపు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఖాతా తెరవాలనే పట్టుదలతో విండీస్ ఉంది. దాంతో.. ఇరుజట్ల మధ్య ఉత్కంఠ పోరు అభిమానులను అలరించనుంది. రికార్డు స్థాయిలో 9సార్లు టాస్ నెగ్గిన శ్రేయాస్ అయ్యర్ బదులు.. షాయ్ హోప్ టాస్ గెలిచాడు. మొదటి మ్యాచ్ ఓటమి అనుభవంతో భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడతడు.
రాంచీలో జరుగుతున్న టీ20లో వెస్టిండీస్ కెప్టెన్ బౌలింగ్ తీసుకున్నాడు. విధ్వంసక ఆటతో విరుచుకుపడే భారత స్టార్లకు కళ్లెం వేసి.. ఛేదనలో చెలరేగాలనే ఉద్దేశంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. విండీస్ ఒక మార్పు(ఫొర్డే స్థానంలో గుడకేశ్ మోతీ)తో ఆడుతుండగా.. జోరు మీదున్న టీమిండియా మాత్రం అదే పదకొండు మందిని కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే శ్రేయాస్ అయ్యర్ సేన 2-0తో ఆధిపత్యం చాటుకుంది. ఒకవేళ కరీబియన్ జట్టు విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతుంది.
#TeamIndia go unchanged for the 2️⃣nd #INDvWI T20I.
Updates ▶️ https://t.co/mZlyaWZsoe
@mflone_ https://t.co/kdBDrGZ5en
— BCCI (@BCCI) October 9, 2026
లక్నోలోని ఎకనా స్టేడియంలో జరిగిన తొలి టీ20లో టీమిండియా భారీ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయాస్ అయ్యర్(102 నాటౌట్) అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకంతో రెచ్చిపోగా.. ఇషాన్ కిషన్(37 నాటౌట్) మరోసారి మెరిశాడు. దాంతో..171 పరుగుల ఛేదనలో పవర్ ప్లేలోనే అభిషేక్ శర్మ(21), సంజూ శాంసన్(11)లు ఔటైనా.. వీరిద్దరూ దూకుడైన ఆటతో చెలరేగారు. అర్ధ శతకం తర్వాత మరింత ఉతికేసిన అతడు 42 బంతుల్లో వంద కొట్టేశాడు. దాంతో.. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా సిరీస్‌లో ముందంజ వేసింది.
భారత తుది జట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, నమన్ ధిర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్, కుల్దీప్ యాదవ్, మయాంక్ యాదవ్.
వెస్టిండీస్ తుది జట్టు: షాయ్ హోప్(కెప్టెన్), కమిల్ పూరన్, షిమ్రన్ హిట్మైర్, రొవ్మన్ పావెల్, రూథర్‌ఫొర్డ్, రొమారియో షెపర్డ్, గుడకేశ్ మోతీ, రోస్టన్ ఛేజ్, అకీల్ హొసేన్, షమర్ స్ప్రింగర్, షమర్ జోసెఫ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

