కోటపల్లి : ఇంటి గోడ (House Wall ) మీద పడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి ( Kotapalli ) మండలం బావనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పనకంటి శ్రీనివాస్‌కు ఇందిరమ్మ ఇల్లు ( Indiramma House ) మంజూరు కాగా పాత ఇంటిని కూల్చేవేసేందుకు కోటపల్లి మండలకేంద్రానికి చెందిన కూలీలు పని చేస్తున్నారు.
శుక్రవారం ఇంటి కూల్చివేత పనులు చేస్తుండగా ఆ ఇంటి గోడ ఒక్కసారిగా రెడ్డి మధునయ్య, శేగం తిరుపతిల పైన పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే 108 అంబులెన్స్ లో చెన్నూర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. కూలీ పనులకు వెళ్లి ఇద్దరు మృతి చెందటంతో కోటపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. సంఘటన స్థలాన్ని కోటపల్లి ఎస్సై రాజేందర్ సందర్శించి వివరాలు సేకరించారు.