మేడ్చల్ : మేడ్చల్ (Medchal) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గౌడవెల్లి(Gowdavelli) రైల్వేస్టేషన్ వద్ద రైలు ఢీ కొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మరణించారు. రాఘవేంద్రనగర్కు చెందిన రైల్వే లైన్మెన్ కృష్ణ(Linemen Krishna) ఆదివారం తన ఇద్దరు కూతుళ్ల (Daughters ) ను విధుల్లోకి వెళ్తూ వెంట తీసుకెళ్లాడు. రైలు ట్రాక్ (Railway Track)పై వారిని కూర్చోబెట్టి పనిచేస్తుండగా దూసుకొచ్చిన రైలు ముగ్గురినీ ఢీ కొట్టింది. దీంతో తండ్రి, ఇద్దరు కూతుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.