నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులో ఫరహాబాద్ నుంచి అటవీ సఫారీ యాత్రలోని గుండం సమీపంలో మంగళవారం పర్యాటకులకు పెద్దపులి కనిపించింది.
– అమ్రాబాద్
హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : అడవుల్లో ఉండాల్సిన పెద్దపులులు జనారణ్యంలోకి వస్తున్నాయి. అడవుల విస్తీర్ణం నానాటికీ తగ్గడం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అక్కడ ఉండలేకపోతున్నాయి. ఆహారం కోసం తరచూ సమీప జనావాసాల్లోకి ప్ర వేశించి పశువులపై దాడి చేస్తున్నాయి. ఐదు నెలల నుంచి ఇలాంటి ఘటనలు పెరుగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు పంజా విసురుతాయోనని భీతిల్లుతున్నారు. ఇటీవల కా మారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లా లో సంచరించిన ఓ పెద్దపులి ప్రస్తుతం జ గిత్యాల, ఆర్మూరు, భీమ్‌గల్ ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించా రు. దాన్ని పట్టుకునేందుకు అన్ని విధా లా ప్రయత్నిస్తున్నట్టు అటవీ శాఖ ప్రధానాధికారి డాక్టర్ సువర్ణ తెలిపారు.
రాష్ట్రంలో అడవులను కాపాడాల్సిన సిబ్బంది తగినంత సంఖ్యలో లేకపోవ డం, అటవీ శాఖలో వేల ఉద్యోగాలు ఖాళీగా ఉండటం ఇందుకు ప్రధాన కార ణం. చెట్ల నరికివేత, అక్రమ మైనింగ్‌కు తోడు నీటిపారుదల ప్రాజెక్టుల్లో భా గంగా అటవీ భూముల్లో కాల్వల నిర్మాణాలు, రైల్వే ప్రాజెక్టులు, రక్షణ శాఖ కేంద్రాల ఏర్పాటుతో మానవ సంచారం బాగా పెరిగింది. దీంతో పులులు, ఎలుగుబంట్లు, దుప్పులు, జింకల్లాంటి వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మా రింది. గతంలో పలు రాష్ట్రాల మధ్య అటవీ ప్రాంతం కలిసే ఉండేది. కానీ, ఇప్పుడు ప్రాజెక్టుల నిర్మాణాలతో అడవుల మధ్య సంబంధాలు లేకుండా పోతున్నాయి. వాటి మధ్య ఉన్న లింకు రోడ్లు తెగిపోతున్నాయి.