న్యూఢిల్లీ : అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day sale) భారత్‌లో జులై 15న ప్రారంభం కానుండగా స్మార్ట్ఫోన్లపై బ్యాంక్ ఆఫర్లు కాకుండా 40 శాతం వరకూ డిస్కౌంట్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. సేల్ సందర్భంగా వన్‌ప్లస్ నార్డ్ 3, ఐక్యూఓఓ నియో 7 ప్రొ, రియల్‌మి నార్జో 60, మోటరోలా రేజర్ 40 అల్ట్రా వంటి ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లు డిస్కౌంట్‌పై లభిస్తాయి, బడ్జెట్ స్మార్ట్ఫోన్లపైనా హాట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే వారికి పలు మేలైన ఆప్షన్స్ ప్రైమ్ డే సేల్ ఈవెంట్లో ముందుకొచ్చాయి.
ఇక న్యూ వన్‌ప్లస్ నార్డ్ 3 రూ. 33,999కి లాంఛ్ కాగా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై పది శాతం ఆఫర్‌తో ఈ ఫోన్‌ను రూ. 32,999కి సొంతం చేసుకోవచ్చు. నార్డ్ 3 ఫ్లాగ్షిప్ డెమెన్సిటీ 9000 ఎస్ఓసీ ప్రాసెసర్, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 890 ఓఐఎస్ కెమెరా సెన్సర్, 80డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్ వంటి లేటెస్ట్ ఫీచర్లను కలిగిఉంది. ఇక ఐక్యూఓఓ నియో 7 ప్రొ న్యూ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో రూ. 33,999 ఎంఆర్పీపై లభిస్తుండగా అమెజాన్ సేల్‌లో డిస్కౌట్పై రూ. 31,999కి అందుబాటులో ఉంది.
స్లిమ్మెస్ట్ ఫ్లిప్ ఫోల్డింగ్ ఫోన్ మొటొరొలా రేజర్ 40 అల్ట్రా ధర రూ. 89,999 కాగా ఆఫర్లో భాగంగా రూ. 82,999కి లభిస్తుంది. రియల్‌మి నార్జో 60 ప్రైమ్ డే సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌పై కేవలం రూ. 22,499కి లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 100ఎంపీ ఓఐఎస్ ఆధారిత ప్రైమరీ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇక పదివేల లోపు స్మార్ట్ఫోన్లు కూడా ప్రైమ్ డే సేల్‌లో కస్టమర్ల ముందుకొస్తున్నాయి. రియల్మీ నార్జో ఎన్53 128జీబీ వేరియంట్ రూ. 8999కి లభిస్తుండగా, శాంసంగ్ గెలాక్సీ ఎం13 రూ.9619, నోకియా సీ12 రూ.5129కి అందుబాటులో ఉన్నాయి.
Read More :
Hyundai | 6 లక్షలకే హ్యుందాయ్ నుంచి అదిరిపోయే కారు.. మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా!