ఆ బీజేపీ నేతల ఖాతాలు నిలిపివేయండి.. ట్విట్టర్‌కు కాంగ్రెస్ లేఖ
ఆ బీజేపీ నేతల ఖాతాలు నిలిపివేయండి.. ట్విట్టర్‌కు కాంగ్రెస్ లేఖ | బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సహా మరో ఇద్దరు బీజేపీ నేతల ఖాతాలను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌కు గురువారం లేఖ రాసింది.

న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సహా మరో ఇద్దరు బీజేపీ నేతల ఖాతాలను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌కు గురువారం లేఖ రాసింది. ‘కొవిడ్-19 టూల్‌కిట్’ పేరుతో సమాజంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించింది. ఇప్పటికే ‘టూల్‌కిట్’పై జేపీనడ్డా, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ప్రతినిధి సంబిత్ పాత్రపై ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. నకిలీ పత్రాలను వ్యాప్తి చేస్తున్న నలుగురు బీజేపీ నేతల ఖాతాలను నిలిపివేయాలని కోరుతూ అధికారికంగా ట్విట్టర్‌కు లేఖ రాసినట్లు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చీఫ్ రోహన్ గుప్తా తెలిపారు.
అయితే, కొవిడ్ పరిస్థితులను అవకాశంగా తీసుకుని కేంద్ర సర్కారుపై, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నిందని, ప్రభుత్వ, ప్రధానిని లక్ష్యంగా చేసుకుని, దేశ ప్రతిష్టను, ప్రధాని మోదీ గౌరవాన్ని చెడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ధ్వంసరచనకు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. ఆ మేరకు కొవిడ్-19 సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ ఓ ‘టూల్‌కిట్’ రూపొందించిందని దాన్ని ఇటీవల బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్ర మంగళవారం మీడియాకు వివరాలు తెలిపారు. దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది. తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ ఓ ‘నకిలీ టూల్‌కిట్’ను సృష్టించిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ నేతలపై సైతం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇవి కూడా చదవండి..
వారణాసి వైద్యులతో నేడు ప్రధాని భేటీ
నేడు వరంగల్ ఎంజీఎంకు సీఎం కేసీఆర్
కీలక పరిణామం.. ఇజ్రాయెల్ – హమాస్ కాల్పుల విరమణ
పంజాబ్‌లో కూలిన మిగ్-21 యుద్ధ విమానం
మహమ్మారికి 329 మంది వైద్యుల బలి
వాహనదారులకు షాక్.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలి’
కరెంట్ లేక ఎండిపోతున్న పంటలు.. హద్నూర్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
Candidates Ultimatum | టీజీపీఎస్సీకి గ్రూప్-1 అభ్యర్థుల అల్టిమేటం.. జీఆర్ఎల్ ఇవ్వకుంటే ఆమరణ దీక్ష
Narendra Modi | నోయిడాలోని జెవార్ ఎయిర్‌పోర్టుకు నరేంద్ర మోదీ పేరు.. ప్రకటించిన యూపీ సీఎం యోగి
గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా, బెల్లం పానకం పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

