టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరికలేకుండా ఉన్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఆచార్య ఫైనల్ స్టేజ్లో ఉంది. మోహన్ రాజాతో చేస్తున్న గాడ్ ఫాదర్ షూటింగ్ ఊటీలో కొనసాగుతోంది. దీంతోపాటు మెహర్ రమేశ్, బాబీ (Bobby) సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. అయితే వీటిలో ఇపుడు బాబీ సినిమా గురించే ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో రౌండప్ చేస్తోంది.
రవితేజ (Ravi Teja)కు చిరంజీవి అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో చిరుతో కలిసి అన్నయ్య సినిమాలో నటించాడు. ఈ చిత్రంలో చిరంజీవి సోదరుల్లో ఒకడిగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే రవితేజ ఇపుడు మరోసారి మెగాస్టార్ తో సిల్వర్ స్క్రీన్ పై మెరువబోతున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బాబీ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటించనున్నాడని టాలీవుడ్ వర్గాల టాక్.
క్రేజీ వార్తపై స్పష్టత రావాల్సి ఉన్నా..అభిమానులు మాత్రం ఈ అప్డేట్ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ రవితేజ-చిరంజీవి సిల్వర్ స్క్రీన్ పై కలిసి నటించే కన్ఫామ్ అయితే అటు చిరు, ఇటు రవితేజ అభిమానులకు మాత్రం పండగే అని చెప్పాలి. రవితేజ ప్రస్తుతం శరత్ మండవతో కలిసి రామారావు ఆన్ డ్యూటీ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.
Samantha Cycling | వర్షంలో సమంత సైక్లింగ్..వీడియో వైరల్