Mega 158 | మన శంకర వరప్రసాద్ గారు అనే చిత్రంతో మంచి హిట్ కొట్టిన చిరంజీవి ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌తో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం తన కెరీర్లో 158వ చిత్రంగా రూపొందుతుంది. ఈ చిత్రాన్ని గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్నారు. ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ మెగాస్టార్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.తాజా సమాచారం ప్రకారం, ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 20, 2026 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.
బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో తండ్రీకూతుళ్ల భావోద్వేగాలతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ కథను రూపొందించినట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. టాలీవుడ్ మాత్రమే కాకుండా ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా ప్రముఖ నటులను ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సినిమా కాస్టింగ్ విషయంలో కూడా ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. మెగాస్టార్‌కు భార్య పాత్రలో నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి నటించనున్నట్లు తెలుస్తోంది. కూతురు పాత్రలో ‘కన్నప్ప’ ఫేమ్ ప్రీతి ముకుందన్ ఎంపికైనట్లు సమాచారం.
ఇక మలయాళ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారనే టాక్ అభిమానుల్లో హైప్‌ను మరింత పెంచుతోంది. అలాగే బాలీవుడ్ దర్శకుడు-నటుడు అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో యాక్షన్ సీక్వెన్స్‌లు హై వోల్టేజ్లో ఉండబోతున్నాయని సమాచారం. మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా బలంగా ఉండబోతుందని టాక్. , ‘మెగా 158’ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ మ్యాజిక్‌ను మించేలా ఉండబోతుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమా మెగా అభిమానులకు మరోసారి థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకురావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.