టాలీవుడ్ (Tollywood)లో రాబోతున్న పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి ఆర్ఆర్ఆర్ ((RRR)). ఎస్ఎస్ రాజౌమళి (SS Rajamouli) దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ అప్డేట్ ఇవాళ టీజర్ రూపంలో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. టీజర్లో భారీ విజువల్స్ ను పెట్టిన జక్కన్న ప్రేక్షకులకు సినిమాతో సరికొత్త అనుభూతిని అందించడం ఖాయమని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. రాంచరణ్, ఎన్టీఆర్ సహా మిగిలిన నటీనటుల యాక్టింగ్‌తో రోమాలు నిక్కపొడుచుకునే సన్నివేశాలతో గూస్బంప్స్ తెప్పిస్తున్న ఆర్ఆర్ఆర్ టీజర్‌పై మహేశ్ బాబు తన స్పందన తెలియజేశాడు.
వావ్..స్టన్నింగ్‌గా అద్బుతమైన విజువల్స్ తో మైండ్ బ్లోయింగ్‌గా ఉంది టీజర్. ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు చూస్తానని చాలా ఎక్జయిటింగ్‌గా ఉందని మహేశ్‌బాబు ట్వీట్ చేశాడు. ఈ మూవీ 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Blown away by the spectacular visuals! Just wow.. stunning!! Can't wait to watch the film #RRRhttps://t.co/22dBLwyLNk@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08
— Mahesh Babu (@urstrulyMahesh) November 1, 2021
ఆర్ఆర్ఆర్లో రాంచరణ్ (Ramcharan) అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా..ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రంభీం పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ నటి అలియాభట్ సీత పాత్రలో, హాలీవుడ్ భామ ఒలివియా మొర్రీస్ మరో ఫీమేల్ లీడ్ రోల్ లో కనిపించనున్నారు. అజయ్‌దేవ్‌గన్, సముద్రఖని, శ్రియా శరణ్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Tamannah In Bhola Shankar | భోళా శంకర్‌లో తమన్నా..తాజా అప్డేట్
Chiranjeevi: మెగాస్టార్ న్యూ లుక్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
Puneet Raj Kumar: పునీత్ చివరి సినిమా కోసం మేకర్స్ సరికొత్త ప్రయత్నం..!