ముంబై , జూలై : ఇవాళ స్టాక్ మార్కెట్లు ప్రారంభ సెషన్ లో నష్టాలతో మొదలయ్యాయి. మొదట నష్టాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే లాభాల్లోకి వచ్చి మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళాయి. సెన్సెక్స్ 35 పాయింట్ల నష్టంతో 52,939 వద్ద, నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 15,843 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు స్టాక్ మార్కెట్ సూచీలపై ప్రభావం చూపుతున్నాయి.