కాసిపేట, అక్టోబర్ 29 : పత్తి మద్దతు ధర పొందాలంటే తేమ శాతం 8 నుంచి 12 శాతం ఉండాలని కాసిపేట మండల వ్యవసాయాధికారి చల్ల ప్రభాకర్ సూచించారు. బుధవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మల్కెపల్లి, గోండుగూడెంలో కపాస్ కిసాన్ యాప్, కౌలు రైతుల రిజిస్ట్రేషన్, పత్తి కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సంధర్భంగా ఏవో చల్ల ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈ సీజన్లో పత్తి కొనుగోలు సీసీఐ కేవలం కపాస్ కిసాన్ యాప్ ద్వారా మాత్రమే చేపడుతారని, ప్రతి రైతు యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం, స్లాట్ బుక్ చేసుకోవడం ఉంటుందన్నారు. దీంతో పాటు పలు అంశాలపై రైతులకు అవగాహాన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు డి. శ్రీధర్, సంధ్యా రాణి, రైతులు పాల్గొన్నారు.