అమరావతి : ప్రజల్లో భక్తీ భావనను పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (Chairman BR Naidu) వెల్లడించారు. చైర్మన్‌గా ఏడాది గడిచిన సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి ఎయిర్‌పోర్టు (Tirupati Airport) కు శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నామని తెలిపారు. ఎయిర్‌పోర్టును ఆలయం సెట్ మాదిరిగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు
. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి రాష్ట్రం రాజధానిలో వేంకటేశ్వర ఆలయం నిర్మించాలని టీటీడీ(TTD) భావిస్తుందని తెలిపారు. ఏడాది కాలంలో అనేక సంస్కరణలు చేపట్టామని అన్నారు. భక్తులకు శీఘ్రగతిన దర్శణం కల్పించేందుకు ఏఐ సాంకేతికను ఉపయోగించుకోనున్నామని వెల్లడించారు.
గతంలో తిరుమలలో ఇష్టారాజ్యంగా 1,500 దుకాణాలకు అనుమతులు ఇచ్చారని, వాటన్నింటినీ క్రమబద్దీకరిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో దుబ్బాక, కరీంనగర్లో శ్రీవారి ఆలయాలను నిర్మించనున్నామని ప్రకటించారు. ఒంటిమ్టిలో వంద గదుల వసతి గృహం నిర్మాణం చేయాలని వివరించారు.
కాణిపాకం ఆలయం వద్ద రూ. 25 కోట్లతో భవనాల నిర్మాణం, తలకోనలో రూ. 19 కోట్లతో ఆలయం అభివృద్ధి చేపడుతున్నామని అన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.