Karthika Pournami | కార్తిక పౌర్ణమి రోజున ఆంక్షలు.. నిరాశలో వెనుదిరిగిన భక్తులు
Karthika Pournami | హిందూ మహిళలకు పవిత్రమైన పూజల్లో ఒకటైన కార్తిక పౌర్ణమి రోజున పోలీసులు ఆంక్షలు విధించడంతో భక్తులు నిరాశకు గురయ్యారు.
అమరావతి : హిందూ మహిళలకు పవిత్రమైన పూజల్లో ఒకటైన కార్తిక పౌర్ణమి( Karthika Pournami ) రోజున పోలీసులు ఆంక్షలు ( Restrictions ) విధించడంతో భక్తులు నిరాశకు గురయ్యారు. ప్రతియేట వేలాదిమంది ప్రజలు కార్తికపౌర్ణమి రోజున ఏపీలోని బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో సముద్ర స్నానాల కోసం భక్తులు తరలివస్తారు. ఈసారి మాత్రం పోలీసులు ఆంక్షలతో వారిని అడ్డుకున్నారు.
ఇటీవల మొంథా తుపాన్ కారణంగా సముద్ర తీరాల ప్రాంతాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వాటిలో తీర ప్రాంత గ్రామాలు, లంకల్లోకి నీరు చొచ్చుకురావడం, సముద్రపు ఒడ్డున ప్రమాదకర గోతులు ఏర్పడడంతో అధికారులు ముందస్తుగా బీచ్‌ను మూసి వేశారు. బుధవారం ఉదయం బీచ్‌కు వచ్చేందుకు యత్నించిన భక్తులను పోలీసులు అడ్డుకుని తిరిగి వెనక్కి పంపించి వేశారు. స
ముద్రపు ఒడ్డున గోతులు ఏర్పడడంతో ప్రమాదాలకు ముప్పు ఉంటుందని భక్తులకు పోలీసులు వివరించారు. బాపట్ల జిల్లాలోని రామాపురం, ఓడరేవు, సూర్యలంక, పాండురంగాపురం బీచ్లలోకి భక్తులు, యాత్రికులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

