తిరుమల : ఇటీవల కాలంలో మున్నెన్నడూ లేని విధంగా శ్రీ వేంకటేశ్వరస్వామి( Lord Venkateshwara swamy ) భక్తులు రికార్డుస్థాయిలో స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనంలో భాగంగా శుక్రవారం నుంచి సాధారణ భక్తులకు దర్శన అవకాశం కల్పించడంతో నిన్న 83,032 మంది భక్తులు దర్శించుకోగా 27,372 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో నిలబడి దర్శనం చేసుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 4.10 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టోకెన్లు లేని భక్తులకు20 గంటల్లో సర్వదర్శనం అవుతుందని తెలిపారు.