హైదరాబాద్ : మేడ్చల్లో శనివారం ఉదయం టిప్పర్ బీభత్సం సృష్టించింది. పారిశుధ్య కార్మికులపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. రోడ్లు ఊడుస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన పడ్డ వారిని హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.