Tiger | బీజింగ్, జవనరి 28 : చైనాలోని ఓ జూ పులుల మూత్రంతో సొమ్ము చేసుకొంటోంది! వాటి మూత్రం కీళ్ల వాతం చికిత్సకు ఉపయోగపడుతుందని ప్రచారం చేస్తున్నది. దీనిపై వైద్యులు, నెటిజన్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చైనా మీడియా కథనం ప్రకారం సిచ్యూన్ ప్రావిన్స్‌లోని ది యాన్ బైఫెంగ్సియా వన్యప్రాణి జంతు ప్రదర్శన శాల సైబీరియన్ పులుల మూత్రం సేకరించి పావు లీటర్ సీసాను రూ.600కు అమ్ముతున్నది. కీళ్లవాతం, బెణుకులు, కండరాల నొప్పులకు ఈ పులుల మూత్రం ఔషధంగా పని చేస్తుందని ప్రచారం చేస్తున్నది. అయితే పులి మూత్రం పనితీరుని నిర్ధారించుకోకుండా ఇలా ఔషధం పేరుతో అమ్మడంపై చైనా సంప్రదాయ వైద్యుడొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు.