కోల్కతా, అక్టోబర్ 29 : భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టనున్న క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్ గురించి కానీ, ఎన్ఆర్సీ పరిశీలన సమయంలో గానీ అధికారులు మీ తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రాలు కనుక అడిగితే వెంటనే స్థానిక బీజేపీ నేతలను కట్టేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రం చేపట్టిన సర్, ఎన్ఆర్సీకి భయపడి ఆత్మహత్య చేసుకున్న పనిహతిలోని ప్రదీప్ కార్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి షాపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.