న్యూఢిల్లీ: అస్సాంలోని శ్రీభూమి జిల్లా బరాక్ వ్యాలీలో కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన సభ వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ నాయకుడు బిధుభూషణ్దాస్ ఆధ్వర్యంలో జరిగిన సభలో బంగ్లాదేశ్ జాతీయ గీతమైన ‘అమర్ సోనార్ బంగ్లా’ను ఆలపించడం వివాదానికి కారణమైంది.
దీనిపై స్పందించిన అధికార బీజేపీ… ఇది భారత ఖ్యాతిని అవమానించడమేనని అభిప్రాయం వ్యక్తంచేసింది. ఇటీవల అస్సాం సహా భారత ఈశాన్య రాష్ర్టాలను తమ దేశంలో భాగంగా చూపుతూ బంగ్లాదేశ్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో తాజా వివాదం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.