న్యూఢిల్లీ, అక్టోబర్ 29 : ఓటర్ల నమోదు, ఓటింగ్‌కు సంబంధించి పౌరుల సందేహాలు, సమస్యలు, ఇబ్బందులు పరిష్కరించడానికి భారత ఎన్నికల సంఘం జాతీయ వోటర్ హెల్ప్‌లైన్ సహా 36 రాష్ర్టాలు/యూటీల్ల్లో హెల్ప్లైన్లను బుధవారం నుంచి క్రియాశీలం చేసింది. అలాగే ఈసీఐనెట్ యాప్ ద్వారా పౌరులు తమ సంబంధిత బూత్ స్థాయి అధికారి (బీఎల్ఓ)తో నేరుగా సంప్రదించేందుకు వీలుగా ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ’ సౌకర్యాన్ని కూడా ప్రారంభించింది.
ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల సమాచారం, అభిప్రాయాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం బీఎల్వోతో బుక్-ఏ కాల్, హెల్ప్‌లైన్ నెంబర్ 1950 సౌకర్యాలను ఉపయోగించుకోవాలనిఈసీ విజ్ఞప్తి చేసింది. ఈసీఐనెట్ యాప్ ద్వారా కూడా పౌరులు సంబంధిత ఎన్నికల అధికారులతో సంప్రదించవచ్చునని తెలిపింది.