– బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాడికొండ సీతయ్య
తుంగతుర్తి, జనవరి 02 : తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రం నుండి మద్దిరాల మండలం వెళ్లే ప్రధాన రహదారి పనులు వెంటనే చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుంగతుర్తి నుండి మధిరాలకు వెళ్లే ప్రధాన రహదారిని కాంట్రాక్టర్ తవ్వి కంకర, డస్ట్ పోసి నాలుగు నెలలు కావస్తున్నా పనులు పూర్తి చేయకుండా ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.
వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలో గాలికి దుబ్బ లేవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ వెంటనే స్పందించి మద్దిరాల- తుంగతుర్తి మెయిన్ రోడ్డు అలాగే తుంగతుర్తి- రావులపల్లి మెయిన్ రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, కేతిరెడ్డి గోపాల్‌రెడ్డి, సర్పంచ్ చింతకుంట్ల మనోజ్, చింతకుంట్ల సురేశ్, గోపగాని రమేశ్, గోపగాని వెంకన్న, రాజేశ్, విజయ్, మహిళలు పాల్గొన్నారు.