మొయినాబాద్, జూలై18 : ఊరికెళ్లి ఇంటికి తిరిగి వచ్చే లోపు దొంగలు గుళ్ల చేశారు. ఇంట్లోని బంగారు అభరణాలు, నగదును అపహరించారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని అజీజ్నగర్ గ్రామానికి చెందిన బొర్ర జంగయ్య, భార్య పిల్లలు బోనాల కోసం వేరే గ్రామానికి వెళ్లారు. భార్య పిల్లలను బోనాలకు వెళ్లడంతో జంగయ్య ఇంటికి తాళం వేసి తుక్కుగూడ వెళ్లాడు. ఇంట్లో ఎవరులేనిది చూసిన దుండగులు ఇంటి తాళం పగుల గొట్టి ఇంట్లో చొరబడ్డాడు.
ఇంట్లోని బీరువా తాళలు పగులగొట్టి అందులో ఉన్న 9 తులాల బంగారం అభరణాలు, రూ.3.75 లక్షల నగదును అపహరించారు. ఊరికి వెళ్లిన జంగయ్య గురువారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంటి తలుపు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూసే పరికి బిర్వ తలుపులు కూడ తెరిచి ఉండగా అనుమానం రావడంతో బీరువాలోని బంగారు అభరణాలు, నగదు కనిపించలేదు. దీంతో పోలీస్ స్టేషన్ వచ్చి, ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.