దైవ దర్శనానికి వచ్చి..
హైదరాబాద్‌లో వీధి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే కు టుంబంలో చీకట్లు కమ్ముకున్నాయి. ఆనందం గా కొడుకు అక్షర శ్రీకార పూజ చేయిద్దామని కుటుంబంతో కలిసి వచ్చిన కుటుంబానికి వి షాదమే మిగిలింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు గోదావరిలో ప్రమాదవశాత్తు చిక్కుకొని మృ తి చెందడం కలచి వేసిం ది.
- బాసర వద్ద గోదావరిలో స్నానాలు చేస్తుండగా ముగ్గురు మృతి
- వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు
- మృతదేహాలను బయటకు తీసిన ఎన్డీఆర్ఎఫ్ బృందం
- కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో దద్దరిల్లిన గోదారి తీరం
ముథోల్, జూన్ 9 : హైదరాబాద్‌లో వీధి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే కు టుంబంలో చీకట్లు కమ్ముకున్నాయి. ఆనందం గా కొడుకు అక్షర శ్రీకార పూజ చేయిద్దామని కుటుంబంతో కలిసి వచ్చిన కుటుంబానికి వి షాదమే మిగిలింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు గోదావరిలో ప్రమాదవశాత్తు చిక్కుకొని మృ తి చెందడం కలచి వేసిం ది. మంగళవారం మ ధ్యాహ్నం బాసర ట్రిపుల్ ఐటీ ఇంటెక్వెల్ సమీపంలో గోదావరి నది వద్ద ప్రమాదం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్‌లోని కాచిగూడ చప్పల్ బజార్ ప్రాంతానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు చంద్రశేఖర్(38), రాంచందర్(36), మల్లేశ్‌కుమార్(31)లు గోదావరిలోకి స్నానానికి దిగారు. స్నానం చేసుకుంటూ లోతైన ప్రాం తంలోకి వెళ్లడంతో ప్రమాదవశాత్తు ప్రవాహంలో చిక్కుకొని గల్లంతయ్యారు. ముగ్గురు కనిపించకపోవడంతో ఘాట్‌పైన ఉన్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.
ముగ్గురు అన్నదమ్ముల మృతదేహాలు బయటపడడంతో ఆ ప్రాంతం బంధువుల రోదనలతో దద్దరిల్లింది. ముగ్గురు కుమారులు ఒకేసారి మృతి చెందిన వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. ఆనందంగా స్నానం చేయడానికి వెళ్లిన వారు తిరిగి విగతజీవులుగా రావడంతో అందరిని విషాదంలో ముంచేసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు బాసర సీఐ దీపక్ తెలిపారు.



Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

