న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కోసం పని చేసిన వారికి గవర్నర్ పదవులు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ అబ్దుల్ నజీర్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ట్రిపుల్ తలాక్, అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు వివాదం, పెద్ద నోట్ల రద్దు వంటి కేసులతో సహా పలు కీలక తీర్పులలో అబ్దుల్ నజీర్ భాగమయ్యారని పేర్కొంది. మోదీ కోసం ఆయన పని చేసినందునే గవర్నర్ పదవి కట్టబెట్టారని ఆరోపించింది.
గుజరాత్‌కు చెందిన పారిశ్రామికవేత్త అదానీ కోసం ప్రధాని మోదీ పని చేశారని, ఇప్పుడు మోదీ కోసం పని చేసిన వారు గవర్నర్లగా నియమితులయ్యారంటూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆదివారం ట్వీట్ చేశారు. ఇక ప్రజల కోసం ఎవరు పని చేస్తారు? అని ఆయన ప్రశ్నించారు.
కాగా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ అబ్దుల్ నజీర్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా పరోక్షంగా విమర్శించారు. దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ గతంలో మాట్లాడిన ఒక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘పదవీ విరమణకు ముందు ఇచ్చే తీర్పుల ప్రభావం, పదవీ విరమణ తర్వాత పొందే ఉద్యోగాలపై ఉంటుంది’ అని 2012లో జైట్లీ అన్న వీడియో క్లిప్‌ను ఆదివారం షేర్ చేశారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో గత మూడు, నాలుగేళ్లుగా ఇలా జరుగుతున్నదని విమర్శించారు. దీనికి ఖచ్చితమైన రుజువు ఈ వీడియో క్లిప్ అని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలను బీజేపీ ఖండించింది.
Modi work for Adani …
There are who work for Modi who are now Governor’s .
Who works for people then ?Bharat Mata ki jai . https://t.co/OOVq4mBofH
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) February 12, 2023
Adequate proof of this in the past 3-4 years for sure https://t.co/33TZaGKr8x
— Jairam Ramesh (@Jairam_Ramesh) February 12, 2023