Sai Kumar | ఆది సాయి కుమార్ కథానాయకుడిగా, షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, ఫస్ట్ డే నుంచే హౌస్‌ఫుల్ షోస్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.ఈ సందర్భంగా గురువారం చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో నటుడు సాయి కుమార్, హీరో ఆది సాయి కుమార్, దర్శకుడు యుగంధర్ ముని పాల్గొన్నారు.
సాయి కుమార్ భావోద్వేగ ప్రసంగం ఇచ్చాడు. మా నాన్న విజయనగరంలో ‘ప్రేమ కావాలి’ సినిమా చూసి చెప్పిన మాటలు ఇవాళ మళ్లీ గుర్తొచ్చాయి. ఈ రోజు ప్రతి చోటా హౌస్‌ఫుల్ బోర్డులు పడుతున్నాయంటే ఎంతో ఆనందంగా ఉంది. నా 50 ఏళ్ల సినీ ప్రయాణంలో 300కి పైగా సినిమాల్లో నటించాను, వెయ్యికి పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పాను. ప్రతి వారం విడుదలయ్యే సినిమాల ఫలితాలు తెలుసుకుంటూనే ఉంటాను.‘పోలీస్ స్టోరీ’ సినిమా హౌస్‌ఫుల్ అవుతుందా అని సందేహపడ్డాను. కానీ హాలు నిండిన బోర్డు చూసి ఎంతో ఆనందపడ్డాను. ఇప్పుడు అదే అనుభూతి ‘శంబాల’తో మళ్లీ కలుగుతోంది. నిన్న నేను ‘శంబాల’ టీషర్ట్ వేసుకుని థియేటర్ విజిట్‌కు వెళ్లాను. వెళ్లిన ప్రతి చోటా అద్భుతమైన స్పందన వచ్చింది” అని తెలిపారు.
ఆది కూడా నా లాగానే డైరెక్టర్ యాక్టర్. నా వాయిస్ ఓవర్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయిందని చెబుతున్నారు. సనాతన ధర్మాన్ని స్పృశిస్తూ యుగంధర్ ఈ సినిమాను అద్భుతంగా తీశారు. కంటెంట్ ఉన్న సినిమాలే విజయం సాధిస్తాయన్నదానికి ‘శంబాల’ నిదర్శనం. ఇది ప్రజల విజయం. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం. త్వరలోనే ‘శంబాల’ టీమ్ సక్సెస్ టూర్ నిర్వహించబోతోంది” అన్నారు. ఇక నా సినీ ప్రయాణంలో అండగా నిలిచిన మీడియాకు, అభిమానులకు, ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు అని ఆది సాయి కుమార్ అన్నాడు.. ప్రీమియర్ల నుంచి డే వన్ వరకు అన్ని చోట్లా హౌస్‌ఫుల్స్ పడుతూనే ఉన్నాయి. భారీ పోటీ మధ్య విడుదలైనా ఈ సినిమా పెద్ద హిట్ కావడం ఆనందంగా ఉంది. త్వరలోనే థియేటర్ల సంఖ్యను పెంచబోతున్నాం. ఈ హాలిడే సీజన్‌ను ‘శంబాల’తో ఎంజాయ్ చేయండి” అన్నారు.