మీరట్: ఈ కరోనా కాలంలో ఎక్కడికి వెళ్లినా ముందుగా కనిపించేది శానిటైజరే. కానీ యూపీలోని నౌచాందీ అనే ఈ మీరట్ పోలీస్ స్టేషన్లో మాత్రం శానిటైజర్ స్థానంలో గంగా జలం కనిపిస్తుంది. స్టేషన్కు వచ్చిన వారికి గంగా జలాన్నే శానిటైజర్లాగా చేతిలో వేస్తున్నారు. అంతేకాదు నుదుటన గంధం బొట్టు కూడా పెడతారు. ఇక్కడి స్టేషన్ ఎస్హెచ్వో ప్రేమ్ చంద్ శర్మ ఆదేశాల ప్రకారమే ఇవి వాడుతుండటం విశేషం.
గంగా జలం ఎందుకు?
ప్రేమ్ చంద్ మాటల్లో చెప్పాలంటే గంగా జలాన్ని మించిన శానిటైజర్ మరొకటి లేదు. కరోనాతోనే కాదు ఇక్కడి నేరాల విషయంలోనూ ప్రేమ్ చంద్ వైఖరి పూర్తి భిన్నంగా ఉంటుంది. గంగా జలం చేతులపై ఉన్న వైరస్లను చంపుతుందని ఆయన బలంగా భావిస్తారు. ఆయన స్టేషన్కు రావడంతో చేతిలో ఓ గంగా జలం బాటిల్తో వస్తారు. ఆ వెంటనే మరిన్ని బాటిల్స్ క్యూ కడతాయి. స్టేషన్కు వచ్చిన వారందరికీ చేతులను శుభ్రం చేసుకోవడానికి ఈ గంగా జలాన్ని ఇస్తారు. ఇక నుదుటన గంధం బొట్టు పెట్టడం వల్ల వాళ్ల ఆందోళనలు తగ్గి ప్రశాంతంగా తమ సమస్యలను పరిష్కరించుకుంటారని ప్రేమ్ చంద్ చెబుతున్నారు.
ప్రత్యేకంగా స్టేషన్కు వచ్చిన రిపోర్టర్లను కూర్చోబెట్టి ఈ గంగా జలం, గంధం బొట్టు విశిష్టతలను చెబుతుండటం విశేషం. అంతేకాదు వాళ్ల ముందే మంత్రాలు చదువుతూ గంగా జలాన్ని తన గదిలో వెదజల్లారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Sneak peek inside his office at Nauchandi police station in UP's Meerut district. SHO Prem Chand Sharma arrived with a bottle of Gangajal and soon several bottles were lined up on the table. pic.twitter.com/fQ4XzDAJVY
— Piyush Rai (@Benarasiyaa) March 28, 2021
ఇవి కూడా చదవండి..