తిరువనంతపురం: మూడు అమృత్‌భారత్(Amrit Bharat Express) ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఓ ప్యాసింజెర్ రైలును ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆ రైళ్లను స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తిరువనంతపురం నుంచి చర్లపల్లి వరకు వచ్చే అమృత్ భారత్ రైలును కూడా ప్రారంభించారు. దీనితో పాటు నాగర్‌కోయిల్-మంగుళూరు, తిరువనంతపురం-తాంబరం మధ్య కొత్త అమృత్‌భారత్ రైళ్లు నడవనున్నాయి. త్రిసూరు నుంచి గురువాయూర్ మధ్య నడిచే ప్యాసింజెర్ రైలును కూడా ప్రారంభించారు. ఈ రైళ్ల ద్వారా కేరళ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
Introduction of #Charlapalli – #Thiruvananthapuram North – Charlapalli Amrit Bharat Weekly Express on 23rd January, 2026 #AmritBharatExpress pic.twitter.com/cBpQQpaClK
— South Central Railway (@SCRailwayIndia) January 22, 2026
చర్లపల్లి నుంచి అమృత్‌భారత్ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7.15 నిమిషాలకు బయలుదేరుతుంది. ఆ రైలు బుధవారం మధ్యాహ్నం 12.45 నిమిషాలకు తిరువనంతపురం చేరుకుంటుంది. ఇక తిరువనంతపురం నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 5.30 నిమిషాలకు రైలు బయలుదేరుతుంది. గురువారం రాత్రి 11.30 నిమిషాలకు ఆ రైలు చర్లపల్లి చేరుకుంటుంది.
The Thiruvananthapuram–Charlapalli #AmritBharatExpress supports tourism, trade and economic integration across Kerala, Tamil Nadu, Andhra Pradesh and Telangana, boosting connectivity and inclusive growth.#AmritBharatExpress4Kerala#ViksitKeralaViksitBharat pic.twitter.com/zy1Vw6y3Gb
— Ministry of Railways (@RailMinIndia) January 23, 2026