Coolie | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) టైటిల్ రోల్లో నటించిన చిత్రం కూలీ (Coolie). లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. కూలీ తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో స్రీనింగ్ అవుతోంది. గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన కూలీ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇండస్ట్రీ సర్కిల్లో ఇప్పుడొక ఆసక్తిక చర్చ నడుస్తోంది.
రజినీకాంత్ లేదా నాగార్జున కూలీ సినిమాకు హైలెట్‌గా నిలుస్తారని అంతా అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఇద్దరు యాక్టర్లు ప్రేక్షకులను కట్టిపడేశారంటూ ఇప్పుడు తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఇంతకీ వారెవరనే కదా మీ డౌటు. పాపులర్ మలయాళ నటుడు, మంజుమ్మెల్ బాయ్స్ ఫేం సౌబిన్ అహిర్, కన్నడ భామ రచితా రామ్. ఇండస్ట్రీ అంతా వీరిద్దరి గురించే చర్చ నడుస్తోంది.
సినిమా విడుదల కాకముందే సౌబిన్ అహిర్‌ను అందరూ విలన్ గ్యాంగ్‌లో ఒకడిగా లిమిటెడ్ టైం కనిపిస్తాడని అనుకున్నారు. ఇక రచితా రామ్ ఇలాంటి కీలక (కళ్యాణి దిలీప్) పాత్ర పోషిస్తుందని కూడా అనుకోలేదు. ఈ ఇద్దరూ ఎవరూ ఊహించని విధంగా స్టన్నింగ్ యాక్టింగ్‌తో సినిమాకు షో స్టాపర్స్‌గా నిలిచారంటూ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇక కూలీ లాంటి భారీ బడ్జెట్ చిత్రంలో తమ నటనతో అదరగొట్టిన ఈ ఇద్దరి కెరీర్ ఇక నుంచి కూలీకి ముందు.. తర్వాత అని మాట్లాడుకుంటారనడం అతిశయోక్తి కాదేమో. మొత్తానికి కూలీ సినిమా తర్వాత సౌబిన్ అహిర్, రచితా రామ్‌కు ఎలాంటి ఆఫర్లు వస్తాయని సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది.
మొత్తానికి టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ యాక్టర్ రజినీకాంత్ లాంటి స్టార్ యాక్టర్లను డామినేట్ చేసి బడా దర్శకనిర్మాతల చూపులను తమవైపు తిప్పుకుంటున్నారు సౌబిన్ అహిర్, రచితా రామ్. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కించగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
Aamir Khan | ‘కూలీ’ సినిమాకు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
Javed Akhtar | దేశద్రోహి అన్న నెటిజన్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జావేద్ అక్తర్
Kangana Ranaut | ఆడవాళ్లనే తప్పుగా చూస్తారు.. పెళ్ళైన వారితో రిలేషన్‌పై కంగనా కామెంట్స్