Natural Liver Detox Drinks | ప్రస్తుత తరుణంలో మనం పాటిస్తున్న అనేక ఆహారపు అలవాట్లు, జీవన విధానం, ఇతర కారణాల వల్ల చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు. అలాగే డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. కొందరు పలు ఇతర రోగాలతో కూడా సతమతం అవుతున్నారు. అయితే చాలా వరకు వ్యాధులు సరైన జీవనశైలిని పాటించకపోవడం వల్లనే వస్తాయి. ఇక లివర్ ఆరోగ్యం విషయానికి వస్తే మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల లివర్ ఆరోగ్యం కూడా అప్పుడప్పుడు మందగిస్తుంది. దీన్ని పట్టించుకోకపోతే తీవ్రమైన లివర్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పలు రకాల సహజసిద్ధమైన డ్రింక్స్‌ను ఇంట్లోనే తయారు చేసుకుని తరచూ తాగడం వల్ల లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. లివర్ క్లీన్ అవుతుంది.
లివర్‌ను క్లీన్ చేసేందుకు గాను ఉపయోగపడే సహజసిద్ధమైన డ్రింక్స్ ఏమిటో, వాటిని ఎలా తయారు చేసుకోవాలో, వాటి వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. లివర్ క్లీన్ అయ్యేందుకు గాను నిమ్మరసం, అల్లం రసం ఎంతగానో దోహదం చేస్తాయి. ఈ డ్రింక్‌ను తయారు చేసేందుకు గాను ముందుగా ఒక కప్పు గోరు వెచ్చని నీళ్లను తీసుకోవాలి. అందులో సగం నిమ్మకాయ ముక్కను పూర్తిగా పిండాలి. అందులోనే కొద్దిగా అల్లం రసం కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం పరగడుపునే సేవించాలి. తరువాత 30 నిమిషాలు వేచి ఉండి బ్రేక్ ఫాస్ట్ చేయాలి. ఇలా రోజూ ఈ డ్రింక్‌ను ఎప్పటికప్పుడు తయారు చేసి తాగడం వల్ల లివర్ లోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. లివర్ క్లీన్ అవుతుంది. నిమ్మరసం, అల్లం రసంలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను క్లీన్ చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి.
లివర్‌ను క్లీన్ చేసేందుకు పసుపు, బీట్ రూట్ జ్యూస్ ఎంతగానో దోహదం చేస్తుంది. ఒక చిన్న బీట్ రూట్‌ను తీసుకుని ముక్కలుగా కట్ చేయాలి. అనంతరం ఆ ముక్కలను మిక్సీలో వేయాలి. అందులోనే కొద్దిగా పసుపు వేసి కలపాలి. తరువాత జ్యూస్‌లా పట్టాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్లను కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసిన మిశ్రమంలోంచి ఒక కప్పు మోతాదు జ్యూస్‌ను తీసుకుని ఉదయం పరగడుపునే సేవించాలి. ఇలా ఈ మిశ్రమాన్ని రోజూ తాగుతుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. లివర్ క్లీన్ అయి ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఈ మిశ్రమాన్ని రోజూ తాగుతుంటే లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఫ్యాటీ లివర్ నుంచి త్వరగా బయట పడవచ్చు.
డాండెలియోన్ అనే మొక్కకు చెందిన వేర్లు కూడా లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ మొక్కకు చెందిన ఎండబెట్టిన వేర్లు మనకు మార్కెట్ లో లభిస్తాయి. వీటిని తెచ్చి శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి. తరువాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి నిల్వ చేసుకోవాలి. ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకుని అందులో ముందుగా సిద్ధం చేసుకున్న డాండెలియోన్ మొక్క వేరు ముక్కను వేసి సన్నని మంటపై 10 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఆ నీటిని వడకట్టి తాగేయాలి. ఈ మొక్క వేరు వల్ల లివర్ పనితీరు మెరుగు పడుతుంది. పిత్తాశయంలో పైత్య రసం సరిగ్గా ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ఈ వేరుతో డికాషన్ తయారు చేసి రోజూ తాగుతుంటే లివర్‌ను క్లీన్‌గా ఉంచుకోవచ్చు. లివర్‌కు చెందిన అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అయితే ఈ డ్రింక్స్ అన్నీ సహజసిద్ధమైనవే అయినప్పటికీ లివర్ సమస్య ఉన్నవారు వైద్యుల సలహా మేరకు వీటిని తాగడం మంచిది.