Foods To Eat Before Bed | ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో నిర్దిష్టమైన సమయంలో మనం పోషకాహారాలను తినాల్సి ఉంటుంది. కొందరు ఉదయమే పౌష్టికాహారాన్ని తింటారు. మరికొందరు సాయంత్రం సమయంలో తింటారు. అయితే రాత్రి పూట ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలని చాలా మంది సందేహిస్తుంటారు. ఎందుకంటే సాధారణంగా రోజూ రాత్రి సమయంలో ఆహారం ఎక్కువగా తినేందుకు, లేదా ఏది పడితే అది తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపించరు. అయితే రాత్రిపూట తినదగిన పౌష్టికాహారాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని ఆ సమయంలో తింటేనే ఎక్కువ లాభాలు కలుగుతాయి. రాత్రి పూట ఈ ఆహారాలను తగిన మోతాదులో తింటే శరీరానికి అనేక పోషకాలు లభించడమే కాకుండా, పలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక రాత్రి పూట తినదగిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చెర్రీ పండ్లు చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే ఈ పండ్లు తియ్యగా ఉంటాయి కనుక రాత్రి పూట వీటిని తింటే క్యాలరీలు చేరుతాయని అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదు. ఎందుకంటే ఈ పండ్లను వాస్తవానికి రాత్రి పూటే తినాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఈ పండ్లను తింటేనే ఎక్కువ లాభాలు కలుగుతాయి. చెర్రీ పండ్లను రాత్రి పూట గుప్పెడు మోతాదులో తినాలి. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మైండ్ రిలాక్స్ అయి నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి తగ్గుతుంది. కనుక నిద్ర సమస్య ఉన్నవారు, మానసిక సమస్యలు ఉన్నవారు రాత్రి పూట ఈ పండ్లను తింటుంటే మేలు జరుగుతుంది.
కివి పండ్లు కూడా మనకు ఆరోగ్యకరమైన ప్రయోనాలను అందిస్తాయి. ఈ పండ్లను కూడా రాత్రి పూట తినవచ్చు. రాత్రి పూట నిద్రకు ముందు ఒక కివి పండును తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండ్లను తింటే శరీరంలో సెరొటోనిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి తగ్గుతుంది. అలాగే కివి పండ్లలో ఉండే విటమిన్ సి వల్ల శరీరం రాత్రి పూట తనకు తాను మరమ్మత్తులు చేసుకుంటుంది. కణాలు పునర్నిర్మాణమవుతాయి. దీంతో మరుసటి రోజు ఉదయం నిద్ర లేచే సరికి యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. రాత్రి పూట నిద్రకు ముందు బాదం పప్పును కూడా తినవచ్చు. ఈ పప్పులో ఉండే మెగ్నిషియం వల్ల కండరాలు ప్రశాంతంగా మారుతాయి. కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా రాత్రి పూట నిద్రలో కాలి పిక్కలు పట్టుకుపోయే సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి తగ్గుతుంది.
రాత్రి పూట నిద్రకు ముందు వాల్ నట్స్‌ను కూడా తినవచ్చు. ఈ నట్స్‌లో ఏఎల్ఏ అనే ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల జాబితాకు చెందుతుంది. దీని వల్ల మెదడు యాక్టివ్‌గా మారి ఉత్తేజంగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచే సరికి ఉత్సాహంగా మారుతారు. చురుగ్గా పనిచేస్తారు. శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. అలాగే రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. ఇక రాత్రి పూట పాలను తాగడం వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుంది. రాత్రి పూట నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా తేనె లేదా పసుపు లేదా మిరియాల పొడి కలిపి తాగితే ఎన్నో లాభాలు కలుగుతాయి. రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా నిద్ర చక్కగా పడుతుంది. ఇలా పలు ఆహారాలను రాత్రి పూట తీసుకుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు.