SL vs PAK : అబుదాబీలో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్లను శ్రీలంక బౌలర్లు వణికిస్తున్నారు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడి స్కోర్ వేగం పెంచిన పాక్ ఆటగాళ్ల జోరుకు థీక్షణ(2-12) బ్రేకులు వేశాడు. ఒకే ఓవర్లో ఓపెనర్ ఫర్హాన్(24), ఫఖర్ జమాన్(17)లను ఔట్ చేశాడు. హసరంగా కుడివైపు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్నాడు. అనంతరం బౌలింగ్‌లోనూ సత్తా చాటుతూ సల్మాన్ అఘా(5)ను వెనక్కి పంపాడు హసరంగ.
అంతే.. తన స్టయిల్‌ను పక్కన పెట్టి రివెంజ్ సెలబ్రేషన్ చేసుకున్నాడు హసరంగ.. తనను బౌల్డ్ చేసిన అనంతరం పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ అచ్చం తనను ఇమిటేట్ చేయడంతో చిర్రెత్తుకొచ్చిన హసరంగ.. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్రార్‌పై రివెంజ్ తీర్చుకున్నాడిలా.
Abrar copied Hasaranga and now Hasaranga mimics Abrar, not once, but twice
Pakistan v Sri Lanka rivalry brewingpic.twitter.com/d2ADw8RGbv
— Lord Immy Kant (@KantInEastt) September 23, 2025
తొలి ఓవర్ నుంచి దూకుడుగా ఆడిన పాక్ ఓపెనర్లు లక్ష్యాన్ని కరిగిస్తూ వచ్చారు. కానీ, థీక్షణ ఎంట్రీతో సీన్ మారిపోయింది. అతడు ఒకే ఓవర్లు రెండు బిగ్ వికెట్లు తీయడంతో… దాంతో ఐదో ఓవర్ మూడో బంతి వరకూ 45-0తో పటిష్ట స్థితిలో ఉన్న పాక్ తొమ్మిదో ఓవర్‌కు 57-4కు చేరింది. ప్రస్తుతం మొహమ్మద్ హ్యారిస్(6), హుసేన్ తలాట్(11) ఆడుతున్నారు. 60 బంతుల్లో 63 పరుగులు చేయాల్సి ఉంది.