మెదక్, రూరల్ సెప్టెంబర్ 23 : అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ (Rahul Raj) అధికారులను ఆదేశించారు. మంగళవారం హవేలీ ఘన్పూర్ మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నాణ్యత ప్రమాణాలు, మిగిలి ఉన్న పనులపై పూర్తి చేయవలసిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అన్నారు.
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో అత్యాధునిక సాంకేతిక విద్య అందించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ జోనల్ మేనేజర్ అనురాధ, డీఈ రాందాస్, ఎలక్ట్రికల్ డీఈ వాణిలత, తదితరులు పాల్గొన్నారు.