SL vs PAK : ఆసియా కప్ సూపర్ 4 రెండో మ్యాచ్‌లో శ్రీలంక ఆదిలో తడబడినా పోరాడగలిగే స్కోర్ చేసింది. టాపార్డర్ విఫలమైనా కమిందు మెండిస్(50) ఒంటరి పోరాటంతో జట్టును ఆదుకున్నాడు. టెయిలెండర్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ స్కోర్‌బోర్డును నడిపించాడు. 16 వ ఓవర్ నుంచి గేర్ మార్చిన మెండిస్ అర్ధ సెంచరీతో లంకను పోటీలోకి తెచ్చాడు. దూకుడుగా ఆడే క్రమంలో 19వ ఓవర్లో ఔట్ కావడంతో లంక 133 పరుగులకే పరిమితమైది.
ఆసియా కప్ లీగ్ దశలో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన శ్రీలంక సూపర్ 4లో అదే జట్టు చేతిలో ఓడింది. దాంతో, పాకిస్థాన్‌తో తప్పక గెలవాల్సిన పరిస్థితి. కానీ, చావోరేవో మ్యాచ్‌లో లంక బ్యాటర్లు విఫమయ్యారు. టాస్ ఓడిన ఆ జట్టుకు పాక్ పేసర్ షాహిద్ అఫ్రిది ఆదిలోనే షాకిచ్చాడు. తొలి బంతికే డేంజరస్ ఓపెనర్ కుశాల్ మెండిస్(0)ను వెనక్కి పంపాడు. ఆ కాసేపటికే పథుమ్ నిశాంక(8)ను ఔట్ చేసి లంకను ఒత్తిడిలో పడేశాడు. 18 పరుగులకే రెండు వికెట్లు పడిన జట్టును కుశాల్ పెరీరా(15), చరిత్ అసలంక(20) ఆదుకునే ప్రయత్నం చేశారు.
Kamindu Mendis reaches 50 off 43 balls
Steady knock when his team needed stability after early wicketspic.twitter.com/mKYEZtRjS7
— ORANGE ARMY (@SUNRISERSU) September 23, 2025
కానీ, ఈ ఇద్దరూ త్వరగానే పెవిలియన్ చేరగా లంక స్కోర్ వంద దాటడం గగనమే అనిపించింది. అయితే.. కమిందు మెండిస్(50 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో ఆపద్భాందవుడి పాత్ర పోషించాడు. వనిందు హసరంగ(15), కరుణరత్నే(17)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన మెండిస్ 16వ ఓవర్ తర్వాత గేర్ మార్చాడు. రవుఫ్ వర్లో తొలి బంతినే బౌండరీకి పంపి జట్టు స్కోర్ 100 దాటించాడు. 19వ ఓవర్లో మెండిస్ ఎల్బీగా వెనుదిరిగాడు. చివరి ఓవర్లో రన్స్ రావడంతో లంక 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగలిగింది.