Godavarikhani : యూనివర్సిటీ పీజీ కళాశాల గోదావరిఖనిలో జాతీయ సేవా పథకం (NSS) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహంకాళి స్వామి (Mahankali Swamy) హాజరై యువత తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను వాటి ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు తెలియజేయాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో కళాశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ మనోహర్ బతుకమ్మ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ రవి శ్యాం కుమార్, డాక్టర్ సుధా, డాక్టర్ అంబిక, అనిల్, రమ్య, రవీందర్, రఘుపతి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ వై ప్రసాద్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు పాల్గొన్నారు.