England Squad : యాషెస్ సిరీస్‌కు రెండు నెలల ముందే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) స్క్వాడ్‌ను ప్రకటించింది. బెన్ స్టోక్స్ (Ben Stokes) సారథిగా 16 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు. హ్యారీ బ్రూక్ (Harry Brook) వైస్ కెప్టెన్సీ అప్పగించారు. ‘ది హండ్రెడ్ లీగ్’తో పాటు అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో రాణించిన పలువురికి స్క్వాడ్‌లో చోటు దక్కింది. అయితే.. ఓవల్ టెస్టులో గాయపడిన క్రిస్ వోక్స్ కోలుకోనందున పక్కన పెట్టేశారు.
నవంబర్ 21న ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ కంగారూ గడ్డపై విజేగత నిలవని ఇంగ్లండ్ ఈసారి పటిష్టమైన స్క్వాడ్‌తో వెళుతోంది. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో అదరగొట్టిన ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్‌లతో బ్యాటింగ్ యూనిట్ దుర్భేద్యంగా ఉంది. ఆల్‌రౌండర్లు జాకబ్ బెథెల్, విల్ జాక్స్‌కు స్క్వాడ్‌లో చోటు దక్కింది. బౌలింగ్ దళంలో జోఫ్రా ఆర్చర్, టంగ్, మార్క్ వుడ్, బషీర్, అట్కిన్సన్లు ఉన్నారు.
Your England Men’s Ashes squad heading Down Under is here! 🦁
Click below for the full story 📝👇
— England Cricket (@englandcricket) September 23, 2025
ఇంగ్లండ్ స్క్వాడ్ : జాక్ క్రాలే, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్(వైస్ కెప్టెన్), జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్(వికెట్ కీపర్), జాకబ్ బెథెల్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, బ్రైడన్ కార్సే, విల్ జాక్స్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్, మార్క్ వుడ్.