సెప్టెంబర్ 22: అంగన్వాడీ టీచర్లు తమ విధినిర్వహణను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ లబ్దిదారులకు పౌష్టికాహారం అందించాలని బెల్లంపల్లి ఏడీపీవో స్వరూపా రాణి అన్నారు. ఐసీడీఎస్ (ICDS) ఆధ్వర్యంలో తాండూర్ సెక్టార్ లోని మహాలక్ష్మి వాడ అంగన్వాడీ సెంటర్లో పోషణమాసం సందర్భంగా ఈసీసీ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీడీపీవో ముఖ్య అతిథిగా హజరై అంగన్వాడీ టీచర్లకు అవగాహన కల్పించారు.
తల్లులు, గర్భిణిలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడమే కాకుండా వారు ఆరోగ్యం ఉండేలా జాగ్రత్తలు సూచించాలని చెప్పారు. బాల్య, ప్రారంభ, సంరక్షణ పోషణ, సార్వత్రిక అభివృద్ధిపై అంగన్వాడీ టీచర్లకు అవగాహన కల్పించారు. చిన్నారులకు సరైన పోషణతో పాటు సరైన విద్యాబోధన చేస్తే వారు శారీరకంగా మానసికంగా ఎదుగుతారని సీడీపీఓ అన్నారు. తక్కువ ఖర్చుతో ఆటవస్తులను తయారు చేసి వాటి ద్వారా పాఠాలు చెబితే చేస్తే పిల్లలు త్వరగా నేర్చుకోగలుగుతారని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లు ఎప్పటికప్పుడు పిల్లల మానసిక శారీరక ఎదుగుదలపై దృష్టి సారించాలని సీడీపీఓ సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ స్వరూప, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.