వీణవంక రూరల్ : దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం లో అమలు చేస్తున్నారని, పేదల సంక్షేమకోసం వేల కోట్ల రూపాలయలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్థి చేకూరేలా పథకాల ను తీసుకొచ్చిన కేసీఆర్ కు ప్రజలందరూ మద్దతివ్వాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ యాదవ్ అన్నారు.
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రజలు అదరించి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు. మండల కేంద్రంలో మంగళవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. యాదవకాలనీలో యాదవ సంఘాల నాయకులను కలిశారు. బీజేపీ మోసపూరిత మాటలను నమ్మవద్దని, అధికారం తప్ప ప్రజల ప్రయోజనాలను పట్టించు కోని పార్టీ బీజేపీ అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి వారి హక్కులను హరిస్తుందన్నారు.
నిరసన తెలుపుతున్న రైతులను కారుతో తొక్కించి చంపిన పార్టీ కి ఓటు వేయవద్దన్నారు. యాదవులు ఆర్థికంగా ఎదగడానకి వెల కోట్ల రూపాయలతో గొర్రెలను యూనిట్ వారిగా అందించిన కేసీఆర్ కు అయన కృత్ఞతలు తెలిపారు. విద్యార్థి నాయకుడు, ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పులువురు యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.