దేవరకద్ర రూరల్, మార్చి 4 : రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వనపర్తిలో సీఎం కేసీఆర్ బహిరంగసభ సందర్భంగా మండలకేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల ప్రజాప్రతినిదులు, కార్యకర్తలతో శుక్రవారం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అని వర్గాల ప్రజలకూ సమన్యాయం చేస్తున్నారన్నారు. ఇన్ని రకాలుగా సేవ చేస్తున్న ముఖ్యమంత్రికి ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని కోరారు. జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ వనపర్తిలోని బహిరంగ సభకు వేలాది మంది తరలివచ్చేలా చూడాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. కార్యక్రమంలో అడ్డాకుల జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, ఎంపీపీలు రమాదేవి, హర్షవర్ద్ధన్రెడ్డి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, వైస్ ఎంపీపీ సుజాత, పార్టీ మండలాధ్యక్షులు నర్సింహారెడ్డి, రాము, రైతుబంధు సమితి అధ్యక్షుడు కొండారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివరాజు, సింగిల్‌విండో అధ్యక్షులు నరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, ఎంపీటీసీ కిష్టన్న, నాయకులు గోపాల్, శ్రీకాంత్‌యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్, శేఖర్‌రెడ్డి, ఆంజనేయులు, భాస్కర్‌రెడ్డి, వెంకట్రాములు, రాము, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.