ఎల్ఐసీ వద్ద అన్క్లైమ్డ్ సొమ్ము 21 వేల కోట్లు
ముంబై, మే 11: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వద్ద పాలసీదారులు క్లెయిం చేయని రూ. 21,336 కోట్ల మొత్తం ఉంది. రెండు మానవసహిత అంతరిక్షయాన ప్రాజెక్టులకు (గగన్యాన్) ఈ మొత్తం సరిపోతుంది. ఇస్రో ప్రతిపాదించిన తొలి గగన్యాన్ ప్రాజెక్టుకు అంచనా వ్యయం రూ. 10,000 కోట్లు. ఎల్ఐసీ వద్దనున్న అన్క్లైమ్డ్ సొమ్మును రెండు గగన్యాన్ ప్రాజెక్టులకు ఉపయోగించవచ్చు.
2021 డిసెంబర్ చివరికల్లా తమ వద్ద రూ. 21,336 కోట్ల క్లెయింకాని మొత్తం ఉందని సంస్థ తెలిపింది. గత పది సంవత్సరాల్లో ఎవరూ ఈ మొత్తాన్ని క్లెయిం చేయలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2012, ఆ తర్వాత చెల్లింపుజరగాల్సిన ఈ మొత్తాన్ని పాలసీదారులు లేదా చట్టబద్ద వారసులు క్లెయిం చేయలేదు. ఇలా క్లెయింకాని మొత్తం 10 సంవత్సరాలకు మించిఉంటే దానిని ప్రతీ సంవత్సరం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్కు బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే అలా బదిలీ చేసిన తర్వాత సైతం పాలసీదారులు/వారసులు25 సంవత్సరాల వరకూ క్లెయిం చేసుకునే వెసులుబాటు ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Business news
- Gaganyan
- ISRO
- lic
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

