మహబూబ్ నగర్ : రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్( Ambedkar ) కృషి వల్లే చిన్న రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి( C Laxmareddy ) అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో పలుచోట్ల నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, అసమానతలు లేని సమాజం కోసం చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. బాబాసాహెబ్ ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అరి అన్నారు.