హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): పోలవరం ఎత్తు పెంచొద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసింది. పీపీఏ చైర్మన్‌కు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ రమేశ్‌బాబు సోమవారం లేఖ రాశారు. ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టాల్సి ఉన్నదని గుర్తుచేసింది. మొదటి దశ లో 41.15మీటర్లు, రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తుకు పెంచాల్సి ఉ న్నదని తెలిపారు.
రెండో దశకు సం బంధించి ముంపు సర్వే, పునరావాసం, ముంపు నివారణ చర్యలపై అనేక వివాదాలున్నాయని తెలిపిం ది. ముంపుపై సర్వే నిర్వహించాలని ఛత్తీస్‌గఢ్‌తోపాటు తెలంగాణకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింద ని, సర్వే చేయాలని ఉత్తర్వులు ఇ చ్చిందని వెల్లడించారు. ఆయా అం శాలపై స్పష్టతనిచ్చే వరకూ ప్రాజెక్టు ఎత్తు పెంపును విరమించుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది.