దుమ్ముగూడెం, మే 11 : మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాలు, గూడేల్లో 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజనులు దుమ్ముగూడెం మండల కేంద్రమైన లక్ష్మీనగరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు వరస ముదరాజు, సోందె మల్లుదొర, కొరస రామచంద్రయ్యలు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా కొందరు గిరిజనేతరులు భారీ నిర్మాణాలు చేపడుతూ 1/70 చట్టం నిబంధనలు అతిక్రమిస్తున్నారని ఆరోపించారు. అలాగే నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ల విషయంపై సమాచార హకు చట్టం ద్వారా సమాచారం కోరినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజనులు రేసు విజయ్, పెనుబల్లి చంటి, అపక రాజేశ్, తెల్లం రాజేశ్, ముర్రం రాంబాబు, కాకా రాముడు, సర్పంచ్లు కొరస దుర్గ, కొరస అర్జున్, చెరుపల్లి, కోయ నర్సాపురం ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.