కేబీఆర్ జాతీయ పారు చుట్టూ కాంగ్రెస్ సర్కార్ జరుపుతున్న పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అభివృద్ధి పేరిట జీవవైవిధ్యాన్ని అడ్డగోలుగా నరికేసున్న రాష్ట్ర ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీ అధికారులకు అత్యున్నత న్యాయస్థానంలో గట్టి షాక్ తగిలింది. హెచ్సిటీ ప్రాజెక్టు కింద రూ. 1090 కోట్లతో ఫె్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం కోసం పారు చుట్టూ ఉన్న వందల ఏళ్ల నాటి చెట్లను ఇష్టారాజ్యంగా నరికివేయడాన్ని తప్పుబడుతూ.. సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది. పారు సరిహద్దు చుట్టూ 25 నుంచి 30 మీటర్ల పరిధిలోని ఎకో సెన్సిటివ్ జోన్లో ఎలాంటి చెట్ల నరికివేత చేపట్టరాదని రాష్ట్ర, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫ్లై ఓవర్ కన్నా ప్రకృతే ముఖ్యమంటూ పేర్కొంది. తదుపరి విచారణ జూలై 27కి వాయిదా వేశారు.
సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా దాదాపు రూ. 1,090 కోట్ల వ్యయంతో 7 ఫె్లైఓవర్లు, 7 అండర్ పాస్‌ల నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్టు కోసం పబ్లిక్ హియరింగ్ (ప్రజాభిప్రాయ సేకరణ) జరపకుండానే, భూసేకరణ ఖర్చులను తప్పించుకోవడమే లక్ష్యంగా.. సైంటిఫిక్ అసెస్ మెంట్ లేకుండానే గతంలో ఉన్న 25-30 మీటర్ల బఫర్ జోన్ ను కేవలం 3 మీటర్లకు కుదించేలా నిబంధనలను నీరుగార్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
పర్యావరణ చట్టాలను తుంగలో తొకి, దాదాపు 1900 వృక్షాల్లో సుమారు 1500ల మేర రాత్రికి రాత్రే కూల్చివేస్తూ అధికారులు బరితెగించారు. 400 చెట్లను ట్రాన్స్ రీలోకేషన్ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ విధ్వంసంపై అధికారుల తీరును ఎండగడుతూ, అధికారుల ఏకపక్ష నిర్ణయాలపై కొన్ని రోజులుగా వాకర్లు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేవ్ కేబీఆర్ బ్యానర్‌తో చిన్నారులు, మహిళలు, వాకర్లు పెద్ద ఎత్తున మానవహారాలు చేపట్టారు. అయినప్పటికీ వినకుండా, అర్ధరాత్రి వేళల్లో చెట్లను తొలగించడం, నిరసనకారులపై అక్రమంగా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తరలించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : కేబీఆర్ జాతీయ పారు చుట్టూ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అభివృద్ధి పేరిట జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీ అధికారులకు అత్యున్నత న్యాయస్థానంలో గట్టి షాక్ తగిలింది. పారు చుట్టూ ఉన్న చెట్లను ఇష్టారాజ్యంగా నరికివేయడాన్ని తప్పుబడుతూ.. సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుపై పర్యావరణ నిపుణులు, వాకర్లు, నగర ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కేబీఆర్ పార్కును కాపాడుకోవడానికి సుప్రీంకోర్టు తీర్పు ఒక ఆశాకిరణమని వారు కొనియాడారు.
పర్యావరణ నిపుణులు, వాకర్ల హర్షం
సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుపై పర్యావరణ నిపుణులు, వాకర్లు, నగర ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత, ఏకపక్ష నిర్ణయాల వల్ల హైదరాబాద్ నగర పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, నెమళ్లు, ఇతర జీవ జాతులకు నిలయమైన ఈ మినీ అడవిని కాపాడుకోవడానికి సుప్రీంకోర్టు తీర్పు ఒక ఆశాకిరణమని వారు కొనియాడారు. ‘అభివృద్ధి కావాలి.. కానీ నగరానికి ఊపిరిపోసే కేబీఆర్ పారును నాశనం చేసి కాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేతో ప్రకృతిని కాపాడుకునేందుకు మళ్లీ ఆశలు చిగురించాయ’ని ఈ సందర్భంగా పర్యావరణ వేత్తలు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన పంతాలను వీడి, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని డిమాండ్ చేస్తున్నారు.

సర్కార్‌కు కనువిప్పు కలగాలి
పర్యావరణాన్ని దెబ్బతీసేలా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ చెట్లను నరికివేస్తున్న ప్రభుత్వానికి సుప్రీం కోర్టు స్టే ద్వారా కనువిప్పు కలగాలి. గతంలో ఎస్ఆర్డీపీ పేరుతో చేపట్టి ఫ్లైఓవర్ల ప్రాజెక్టు సమయంలో కేబీఆర్ పార్కు చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్‌ను నిర్ధారించలేదని మేము హైకోర్టును ఆశ్రయించగా స్టే మంజూరు చేసింది. అప్పటి నుంచి స్టే అమల్లోనే ఉంది. అయితే ఇటీవల హెచ్సిటీ పేరుతో చేపట్టిన ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల కోసం వేలాది చెట్లను నరికేస్తున్నారు. ఈ విషయంపై ఈనెల 5న హైకోర్టును ఆశ్రయించగా, వేసవి సెలవుల కారణంగా లిస్ట్ కాలేదు. దీంతో సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ ద్వారా మా అభ్యంతరాలు తెలియజేశాం. ఎట్టి పరిస్థితిలో 35 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ ఉంచాల్సిందేనని, దాన్ని కాపాడాలని స్టే వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకోవాలి.
-కాజల్ మహేశ్వరి, పర్యావరణ ప్రేమికురాలు, పిటిషనర్
పర్యావరణాన్ని నాశనం చేయొద్దు
కేబీఆర్ జాతీయ ఉద్యానవనంతో పాటు బయట ఉన్న వాక్‌వేలు, సెంట్రల్ మీడియన్‌లోని వేలాది వృక్షాల ద్వారా ఎంతో చల్లదనంతో పాటు కేబీఆర్ నుంచి బయటకు వచ్చే పక్షులు,నెమళ్లకు ఆశ్రయం కలుగుతున్నది. అయితే సుమారు 35 మీటర్ల మేర ఉండాల్సిన ఎకో సెన్సిటివ్ జోన్‌ను తమకు ఇష్టమొచ్చిన రీతిలో నిర్ణయించి, ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా సుమారు 1200 దాకా భారీ చెట్లను నరికివేశారు. ఇదేంటని మేము ప్రశ్నిస్తే కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా..కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్‌ను కాపాడేందుకు మేము పోరాటం కొనసాగిస్తాం. వెంటనే ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఎకో సెన్సిటివ్ జోన్‌ను నిర్ధారించాలి.
-విజయ్ మల్లంగి, సేవ్ కేబీఆర్ ప్రతినిధి