సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో భానుడి భగభగలు బెంబేలెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో ఎండవేడిమికి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడగాలులు వీస్తున్నాయి.
శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 41.5, కనిష్ఠం 29.1డిగ్రీలు, గాలిలో తేమ 22శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా రేపు, ఎల్లుండి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి, ఆకస్మిక వానలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.