మరికల్, జూలై 2 : నారాయణపేట జిల్లా మరికల్ మండలం పస్పుల ప్రాథమిక పాఠశాల ఆవరణ చిన్నపాటి వర్షానికే కుంటను తలపిస్తున్నది. ఈ పాఠశాలలో ఇటీవల రూ.8.25 లక్షలతో ప్రహరీ నిర్మించారు. నీరు బయటకు వెళ్లేందుకు అవకాశం లేకుండా ప్రహరీని నిర్మించడంతో రెండురోజులుగా కురుస్తున్న వర్షానికి బుధవారం నీరు నిలిచి కుంటలామారింది.
దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ఆవరణలో మోటర్లు పెట్టి నీటిని తరలిస్తున్నా నీరు తగ్గకపోవడంతో సదరు కాంట్రాక్టర్‌పై అసహనం వ్యక్తంచేస్తున్నారు.