హైదరాబాద్, మే 15 (నమస్తేతెలంగాణ): రైల్వే ర్యాక్ పాయింట్లలోని ఎరువులను గోదాములకు తరలించడంలో ఆలస్యం జరుగుతున్న మాట నిజమేనని, త్వరలోనే సమస్యను పరిషరిస్తామని మార్ఫెడ్ ఎండీ తెలిపారు. ఎరువుల తరలింపులో జరుగుతున్న ఆలస్యంపై ‘నమస్తే తెలంగాణ’లో ‘లారీలు లేవు.. యూరియా లోడ్ ఎత్తలేం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించిన ఎండీ వివరణ ఇచ్చారు. కాంట్రాక్టు సంస్థకు చెందిన లారీలు ధాన్యం, మక కొనుగోలుకు తరలించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
జాప్యంపై హెచ్అండ్టీ కాంట్రాక్టు సంస్థకు ఈనెల 12న లేఖ రాసినట్టు తెలిపారు. ఎరువుల కోసం కేటాయించిన లారీలను ధాన్యం కొనుగోలు నుంచి తిరిగి పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.