అహ్మదాబాద్: ఒక భజన గాయకుడిపై కొందరు వ్యక్తులు నోట్ల వర్షం కురిపించారు. ఆయన పాడుతుండగా కరెన్సీలో ముంచెత్తారు. దీంతో ఆ గాయకుడు డబ్బుల కుప్పలో మునిగిపోయారు. (Cash Rain on Gujarati Folk Singer) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖంభాలియా గ్రామంలో శ్రీమద్ భాగవత్ సప్తః కార్యక్రమం నిర్వహించారు. గుజరాతీ జానపద గాయకుడు గోపాల్ సాధు పలు భక్తి పాటలతో అందరినీ అలరించారు.
కాగా, ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు ఆ గాయకుడిపై నోట్ల వర్షం కురిపించారు. గోపాల్ సాధు భక్తి పాటలు పాడుతుండగా సంచుల్లో తెచ్చిన డబ్బును ఆయన తలపై కుమ్మరించారు. దీంతో డబ్బుల కుప్పలో ఆయన పూర్తిగా మునిగిపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు గుజరాత్లో నిర్వహించే భజన కార్యక్రమాల్లో గాయకులపై డబ్బు వర్షం కురిపించడం ఇదే మొదటిసారి కాదు. 2023లో వల్సాడ్లో జరిగిన ప్రత్యేక భజన కార్యక్రమంలో గాయకుడు కీర్తిదాన్ గధ్విపై నోట్ల వర్షం కురిపించారు. 2022 డిసెంబర్లో నవసారి గ్రామంలో ఒక భజన కార్యక్రమంలో కూడా రూ. 50 లక్షల విలువైన నోట్లను ఆయనపై కురిపించారు. 2017, 2018లో కూడా ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Watch | A singer was nearly buried under a shower of currency notes during a Dayro event in Gujarat. The video is from last night’s performance at a Shrimad Bhagwat Saptah in Khambhaliya, Dwarka district. Organisers announced that after covering the event’s operational expenses,… pic.twitter.com/C3MQY3ht28
— DeshGujarat (@DeshGujarat) May 15, 2026