నార్నూర్: పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తూ ఎంపీడీవో (MPDO) గా ఉద్యోగం సాధించడం హర్షనీయామని మాజీ సర్పంచ్ రాథోడ్ సావిందర్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్ పంచాయతీ పరిధిలోని రాజుల్ గూడ గ్రామంలో ఎంపీడీవో లవ్ కుమార్ ( Lovkumar ) మాన్కాపూర్ పంచాయతీ కార్యదర్శి నీరజ్‌ను గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తు గ్రూప్ 1 పరీక్షలో ఉత్తీర్ణులై ఎంపీడీవోగా ఉద్యోగం సాధించడం గర్వకారణమని అన్నారు. నేటి యువత ఎంపీడీవో ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మాజీ సర్పంచ్ రామేశ్వర్,ఉపసర్పంచ్ రాథోడ్ గణేష్,మాజీ ఉపసర్పంచ్ రాథోడ్ గోవింద్ , గణేష్, గోవింద్, రాథోడ్ జై వంత్ రావ్, మహిళలు ఉన్నారు.