న్యూఢిల్లీ, మార్చి 23: జాతీయ రహదారులపై రెండు టోల్ బూత్ల మధ్య దూరం కచ్చితంగా 60 కిలోమీటర్లు ఉండాలని, మధ్యలో అదనంగా ఏర్పాటు చేసిన వాటిని మూడు నెలల్లో పూర్తిగా తొలగిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇలా మధ్యలో టోల్ ప్లాజాలను ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని ఆయన లోక్సభలో పేర్కొన్నారు.