సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 7: మున్సిపల్ ఎన్నికల వేళ సిరిసిల్లలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావుకు ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వీహెచ్ పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ఆయా వార్డుల్లో మ హిళలు ఆయన్ను నిలదీశారు.
తులం బంగారం ఇంకెప్పుడిస్తరని ప్రశ్నించగా.. అసహనంతో బంగారం ధర లక్షా 75వేలైందని, ఎట్లా ఇస్తమని తిగిరి వారినే ప్రశ్నించారు. అందరికీ ఇ వ్వాలంటే ఇప్పటికే అప్పుల్లో ఉన్న ప్రభుత్వం.. మరింత అప్పుల్లోకి పోతుందని అనడంతో మహిళలు ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తంచేచేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.